జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొవిడ్-19 సర్వే సందర్భంలో ఆశావర్కర్లకు, అంగన్వాడీలకు సర్వే లో ఇబ్బందులు తలెత్తాయి. దానితో వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కేంద్రంలో ధర్నాకు దిగారు. నిన్న జిల్లా కేంద్రంలో 24వ వార్డులో సర్వే చేస్తుండగా అక్కడి స్థానికులు, వార్డు కౌన్సిలర్ ఆశా వర్కర్ పద్మను అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక టౌన్ ఎస్సై సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఎండీ షఫీ, మునీసా బేగం, ఎండీ అబ్దుల్ హకీంలపై కేసు నమోదు చేశారు.
ఆశావర్కర్ల ధర్నా.. దూషించిన ముగ్గురిపై కేసునమోదు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వే నిర్వహిస్తున్న ఆశావర్కర్ల పట్ల కొంత మంది ప్రజలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారి ఆశావర్కర్లు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. స్థానిక ఎస్సై సత్యనారాయణ వచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి.. అసభ్య పదజాలం ఉపయోగించిన ముగ్గురిపై కేసునమోదు చేసుకున్నారు.
ఆశావర్కర్ల ధర్నా.. దూషించిన ముగ్గురిపై కేసునమోదు
ముస్లింల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ సర్వే చేయడానికి వచ్చారంటూ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు వాపోయారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు వెళ్తామని వెల్లడించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని.. కేసు నమోదు చేసుకుని.. వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై సత్యనారాయణ హామీ ఇవ్వడం వల్ల వారు ధర్నాను విరమించారు విధులకు వెళ్లారు.
ఇదీ చూడండి:25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!