గనిలో ఉద్యోగం నిత్యం ప్రాణసంకటంగా మారింది. విధులకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవరకు భరోసా ఉండడం లేదు. గనిలో తరచూ జరిగే ప్రమాదాలు కార్మికులను అర్ధాయుష్కులును చేస్తున్నాయి. శ్రామికుడినే నమ్ముకుని జీవిస్తున్న వారి కుటుంబాలను దిక్కులేనివారిగా రోడ్డున పడుతున్నాయి.
రెండు నెలల క్రితమే లేఖ రాసినా..
ఇటీవల భూపాలపల్లి కేటీకే ఆరో ఇంక్లైన్‌లో ఇద్దరు కార్మికులు మృత్యవాతపడ్డారు. గనిలో పైకప్పుకు దిమ్మెలు ఏర్పాటు చేసే ముందు రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఓవర్‌మెన్, సర్దార్‌ల పర్యవేక్షణలో పనులు జరగాల్సి ఉన్నా... అవగాహన లేని కార్మికులతో పనులు చేయించడం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. పైకప్పు బలహీనంగా ఉన్న ప్రాంతంలో పనిచేయడం ప్రమాదకరమంటూ రెండు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఓవర్‌మెన్ లేఖ రాసినా పట్టించుకోలేదు.
ఆరేళ్లలో 59 మంది మృతి..