Telangana Corona Cases Today :దేశవ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత ఏడాదిన్నర నుంచి మాస్కు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్న ప్రజలను భయపెట్టేందుకు మరోసారి వచ్చేసింది. తరచూ రూపాంతరం చెందుతూ న్యూ వేరియంట్లతో గడగడలాడిస్తోంది. తాజాగా జేఎన్1 న్యూ వేరియంట్ రూపంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. న్యూ వేరియంట్ కేసులు రాష్ట్రంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు పటిష్ఠ చర్యలు చేపట్టింది.
Corona Cases in Bhupalapally :అయితే జిల్లాల్లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కొవిడ్(Covid) పాజిటివ్ రావడం కలకలం రేపింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇటీవల కరోనా సోకింది. అనంతరం ఆమె కుటుంబీకులు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో వారిలో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
Five Members In A Family Tested Corona Positive in Bhupalpally :ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు సదరు కుటుంబ సభ్యులను వారి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. స్థానిక ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే గత వారంలో వారితో కాంటాక్ట్ అయిన వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు.