తెలంగాణ

telangana

ETV Bharat / state

భూపాలపల్లి జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సోమవారం 20 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జిల్లా వైధ్యాదికారి సుధారా సింగ్‌ వెల్లడించారు. అలాగే ఏఆర్‌ ఎస్సై హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.

భూపాలపల్లి జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్‌
భూపాలపల్లి జిల్లాలో 20 మందికి కరోనా పాజిటివ్‌

By

Published : Jul 28, 2020, 9:36 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారా సింగ్ తెలిపారు. మహదేవ్ పూర్ సీహెచ్‌సీలో రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ( ఆర్ఎటీ ) ద్వారా 23 నమూనాలు తీసి పరీక్షించగా 6 పాజిటివ్ వచ్చాయన్నారు. చిట్యాల సీహెచ్‌సీలో 20 నమూనాల్లో 4 , రేగొండలో 9కి 6, కాటారంలో మూడింటికి 2, ఒడితల పీహెచ్‌సీలో 3 నమూనాలు సేకరించి పరిక్షించగా 2 పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు.

అలాగే భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఏఆర్ ఏస్సై హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. జిల్లా పోలీస్ శాఖలో ఇది తొలి మరణం కావడం వల్ల కలవరం నెలకొంది.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details