తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన జాతరపై చిన్నచూపు

మేడారం చినజాతరకు సమయం దగ్గర పడుతోంది. ఏటా లక్షల్లో వచ్చే భక్తులకు సదుపాయాలు కరవయ్యాయి.

By

Published : Feb 5, 2019, 5:31 PM IST

Updated : Feb 5, 2019, 6:48 PM IST

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

మేడారం చినజాతర
మేడారం చిన జాతర ఈ నెల 20 నుంచి నాలుగు రోజుల పాటు జరనుంది. భక్తుల రాక ఇప్పటికే మొదలైంది. ఏర్పాట్లపై మాత్రం అధికారులు పెద్దగా దృష్టి సారించట్లేదు. తాగునీరు, స్నానఘట్టాల వద్ద సరైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్నజాతర నిర్వహించటం ఆనవాయితీ. దీనిని 'మండమెలిగే' పండుగగా వ్యవహరిస్తారు.
వన దేవతల ఆగమనం లేకపోయినా సమ్మక్క, సారలమ్మ ఆలయాల చెంత శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి పూట జాగారాలు చేస్తూ... నాలుగు రోజులు వైభవంగా నిర్వహిస్తారు. గత రెండేళ్ల నుంచి చిన్న జాతరకొచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది మూడు నుంచి నాలుగు లక్షల వరకు భక్తులు దర్శించుకుంటారని అంచనా. సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆది, బుధవారాల్లో హన్మకొండ నుంచి అదనపు బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు.
Last Updated : Feb 5, 2019, 6:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details