జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రజలను అతలాకుతలం చేస్తోంది.
ఎడతెరిపి లేని వానలు... పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు - జయశంకర్ భూపాలపల్లి వార్తలు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. చెరువులు, పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీటితో నిండిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఎడతెరిపి లేని వర్షం... పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు
భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్లా, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం, మలహల్ రావు, పాలిమల మండలాలలో కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు, వాగులు నిండి పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి:భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు