జయశంకర్ భూపాలపల్లిలో రవాణా శాఖ.. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీని నిర్వహించింది. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా గాంధీ విగ్రహం, హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 2 కిలో మీటర్ల దూరం హెల్మెట్ ధరించి, బైక్ నడుపుతూ ర్యాలీ ప్రదర్శించారు.
భూపాలపల్లిలో హెల్మెట్ ధరించి ద్విచక్రవాహన ర్యాలీ
బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.
భూపాలపల్లిలో హెల్మెట్ ధరించి ద్విచక్రవాహన ర్యాలీ
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పోలీస్, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరు బైక్ నడిపే వారు హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదంలో చాలా మేధావుల పిల్లలు చనిపోయారని, ఇప్పుడు కుటుంబాలు చాలా బాధపడుతున్నాయిని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'నేనేతప్పూ చేయలేదు.. కేవీపీకి తెలంగాణలో ఓటే లేదు'