తెలంగాణ

telangana

ETV Bharat / state

లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి

జనగామలో భాజపా శ్రేణులపై లాఠీఛార్జీ​ చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని... లేకుంటే భారీ ఆందోళనకు దిగుతామన్నారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన పవన్‌శర్మను పరామర్శించారు.

bandi sanjay
bandi sanjay

By

Published : Jan 13, 2021, 3:38 PM IST

తెరాసకు భయం అంటే ఏంటో చూపిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్‌శర్మను సంజయ్ పరామర్శించారు. ముందుగా జనగామకు చేరుకున్న సంజయ్.. చౌరస్తా నుంచి ఆస్పత్రికి ర్యాలీగా వెళ్లారు. కార్యకర్తలను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

"పోలీసులకు మేము వ్యతిరేకం కాదు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు కావడం లేదు. దాడి చేసిన పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే భారీ ఆందోళనకు దిగుతాం. భాజపాను అణచివేయాలని సీఎం చూస్తున్నారు. భాజపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు."

- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి

ABOUT THE AUTHOR

...view details