తెలంగాణ

telangana

ETV Bharat / state

మెకానిక్ నుంచి మావోయిస్టు

అరోగ్యం సహకరించకపోవడం ఓ మావోయిస్టు మనసు మార్పునకు కారణమైంది. ఏడాది పాటు దళంలో పనిచేసి వరంగల్ పోలీసు కమిషనర్ ఎదుట లొంగిపోయాడు.

లొంగిపోయాడు

By

Published : Feb 22, 2019, 11:45 PM IST

జనగామ జిల్లా తీగారం గ్రామానికి చెందిన నాగరాజు నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యుడు. ఏడాది క్రితం దళంలో చేరాడు. అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ ఎదుట లొంగిపోయాడు. పదో తరగతి వరకు చదువున్న నాగరాజు బోరు మోటారు మెకానిక్​గా పనిచేశాడు. 2018 జనవరిలో దళ సభ్యునిగా చేరాడు. ఏడాది పాటు పార్టీ కార్యదర్శి హరిభూషన్ వద్ద పనిచేశాడు. ఆరోగ్యం సహకరించక జనజీవన స్రవంతిలో కలిశాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details