రానున్న దసరా పండుగ వరకు రైతులకు సమగ్ర సేవలందించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని చిల్పూర్ ఎంపీపీ బొమ్మశెట్టి సరిత సూచించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలంలోని పలు క్లస్టర్ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు రైతు వేదికల నిర్మాణాలతో పాటుగా పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, ఇంకుడు గుంతలు, పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పల్లెప్రకృతి వనంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు.
'దసరాలోగా రైతు వేదికలను పూర్తి చేయాలి'
దసరా పండుగ వరకు రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలని చిల్పూర్ ఎంపీపీ బొమ్మశెట్టి సరిత అధికారులకు సూచించారు. రైతువేదికలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు.
'దసరాలోగా రైతు వేదికలను పూర్తి చేయాలి'