కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ మనరాష్ట్రం నుంచే రావడం గర్వకారణంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. గత ఏడాదిలో ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'తెలంగాణలోనే టీకాను రూపొందించడం గర్వకారణం'
కరోనా టీకా తీసుకుని ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికునికి ఇస్తున్న వైద్యసిబ్బంది
తొలిరోజు మొదటి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు నరసింహకు వేశారు. మనరాష్ట్రంలో తయారైన టీకాను విదేశాలకు ఎగుమతి చేయడం గొప్ప విషయమన్నారు. దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.