తెలంగాణ

telangana

ETV Bharat / state

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో

జగిత్యాల జిల్లాలో వీఆర్వో అనిశా వలలో చిక్కుకున్నాడు. మెట్​పల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్వో బాపయ్యను 3 వేలు లంచం తీసుకుంటుండంగా అధికారులు పట్టుకున్నారు.

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో

By

Published : Jun 11, 2019, 10:33 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం తహసీల్దార్​ కార్యాలయంలో వీఆర్వో బాపయ్యను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బండలింగాపూర్​కు చెందిన మహమ్మద్​ అనే రైతు తన తండ్రి పేరు మీదున్న వ్యవసాయ భూమిని తన పేరిట మోటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం 3 వేలు లంచం డిమాండ్​ చేశాడని మహమ్మద్​ అనిశా అధికారులను ఆశ్రయించాడు. 3 వేల లంచం తీసుకుంటుండగా వీఆర్వోను అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

అనిశాకు చిక్కిన మెట్​పల్లి వీఆర్వో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details