జగిత్యాల జిల్లా లింగంపేట రైల్వే స్టేషన్‌కు విశాఖపట్నం పోర్టునుంచి 13 వందల 29 టన్నుల యూరియా వచ్చింది. ఈ లోడ్‌ను అధికారులు మండలాలకు లారీల ద్వారా తరలిస్తున్నారు. గత 20 రోజులుగా జగిత్యాల జిల్లాలో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం యూరియాను జిల్లాకు తెప్పించడం వల్ల కర్షకులకు ఉపశమనం కలిగినట్లయింది. ఇదే యూరియా పదిరోజుల ముందు అంది ఉంటే అన్నదాతలకు తిప్పలు తప్పేవని రైతు నాయకులు చెబుతున్నారు.
జగిత్యాలకు చేరిన యూరియా...
యూరియా కొరతతో అల్లాడుతున్న రైతుల కష్టాలను తీరనున్నాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం వల్ల విశాఖపట్నం పోర్టునుంచి 13 వందల 29 టన్నుల యూరియా జగిత్యాల జిల్లా లింగంపేట రైల్వే స్టేషన్‌కు చేరింది.
జగిత్యాలకు చేరిన యూరియా...