జగిత్యాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పట్టణంలోని ధర్మపురి రహదారిపై పెట్రోలు బంకు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒర్సు నరేశ్ అనే యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనటం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే తరహాలో చల్గల్లో బైక్పై వెళ్తున్న బోలా జాదవ్.. గుర్తు తెలియని వాహనం ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈర్ఖండ్ వాసి అయిన ఇతను అల్లీపూర్లో జేసీబీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. రెండు మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే తరహాలో రెండు రోడ్డు ప్రమాదాలు - TWO DEAD
జగిత్యాలలో ఒకే తరహాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
ఒకే తరహాలో రెండు రోడ్డు ప్రమాదాలు