ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజుకు కొనసాగుతోంది. జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి కొత్త బస్టాండ్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. బస్‌స్టాండ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి మానుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన - LATEST NEWS OF TSRTC WORKERS PROTEST
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు.
జగిత్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన