జగిత్యాల జిల్లా ఐదేళ్ల బాలునిపై కరోనా పంజా విసిరింది. వ్యాధి సోకినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ నిర్ధరించగా.. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబసభ్యులు, అనుమానితులు మొత్తం పది మందిని కొండగట్టు జేఎన్టీయూ క్వారంటైన్ హోంకు తరలించారు. ఇదిలా ఉండగా వ్యాధి వెలుగు చూసిన గ్రామానికి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గ్రామంలో అధికారులు ఇంటింటికి సర్వే చేపట్టగా... పారిశుద్ధ్య సిబ్బంది క్రిమి సంహారక మందును పిచికారి చేశారు.
ఎలా సోకిందంటే....?
సదరు బాలుడు బధిరుడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కేంద్రంలో బధిరులకు ఉచిత శస్త్రచికిత్స చేస్తున్నారని తెలుసుకుని లాక్డౌన్కు ముందు అక్కడికి వెళ్లారు. శస్త్ర చికిత్స పూర్తయినా... లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయారు. లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించగా.. గుంటూరు నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఈ నెల 14న గ్రామానికి చేరుకున్నారు.