తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన సబ్​కలెక్టర్

జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో సబ్‌కలెక్టర్‌ గౌతమ్ పొట్రు తనిఖీలు నిర్వహించారు. వైద్యశాలలో సూపరింటెండెంట్​తో సహా ఎవరు లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు తీరు మార్చుకోవాలని సూచించారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన సబ్​కలెక్టర్

By

Published : Jul 18, 2019, 4:16 AM IST

Updated : Jul 18, 2019, 8:08 AM IST

మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయాల్సిన వైద్యులు ఒంటి గంటకు ముందే విధులు ముగించుకుని వెళ్తున్నారు. జగిత్యాల జిల్లా ఆస్పత్రి తీరుపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై సబ్‌కలెక్టర్‌ గౌతమ్‌ పొట్రు స్పందించారు. జిల్లా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయంలో వైద్యులు ఎవరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌ సదామోహన్‌ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేశారు. సబ్‌కలెక్టర్‌ తనిఖీలకు వచ్చిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే తిరిగివచ్చారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన సబ్​కలెక్టర్
Last Updated : Jul 18, 2019, 8:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details