జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో ముద్గంపల్లి ఎల్లయ్య అనే రైతు మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. తన పొలంలో వృథాగా ఉన్న గడ్డికి నిప్పంటించాడు. మంటలు వేగంగా వ్యాపించి ఎల్లయ్యను చుట్టుముట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో మంటల్లో చిక్కి రైతు మృతి
జగిత్యాల జిల్లా చెప్యాలలో ఎల్లయ్య అనే రైతు మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. పొలంలో వృథాగా ఉన్న గడ్డికి నిప్పంటించగా అది వేగంగా అతన్ని చుట్టుముట్టింది.
రైతు మృతి