జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గోపాల్రావుపేట రైల్వే ట్రాక్ సమీపంలో 70 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ రైతు పొలం వద్ద గడ్డి కుప్పలో దాచి ఉంచారని పక్కా సమాచారంతో స్పెషల్ బ్రాంచ్‌తో పాటు కొడిమ్యాల పోలీసులు వెళ్లి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గోపాల్రావుపేట రేషన్ బియ్యం పట్టివేత - jagityala district latest news
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. జగిత్యాల జిల్లా గోపాల్రావుపేట రైల్వే ట్రాక్ సమీపంలో 70 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
గోపాల్రావుపేట రేషన్ బియ్యం పట్టివేత
గ్రామాల్లో పది రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలోని నాందేడ్, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని గడ్డిలోంచి బయటికి తీసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.