జగిత్యాలలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న బాలకార్మికులను అధికారులు గుర్తించి వారికి విముక్తి కల్పించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. పట్టణంలో 15 మందిని గుర్తించిన అధికారులు వారిని కరీంనగర్‌లోని చైల్డ్‌హోమ్‌కు తరలించారు. బడిమానేసిన పిల్లను బడికి పంపేలా, కార్మికులుగా పని చేసే వారిని గుర్తించి వారికి విముక్తి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. 14 ఏళ్లలోపు గల బాలబాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
జగిత్యాలలో 'ఆపరేషన్ ముస్కాన్'
జగిత్యాల జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలో 15 మంది చిన్నారులను గుర్తించి వారిని కరీంనగర్‌లోని చైల్డ్‌హోమ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
జగిత్యాలలో 'ఆపరేషన్ ముస్కాన్'