జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 14వ వార్డు భాజపా అభ్యర్థి ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్ల కాళ్లపై పడుతున్నారు. మాజీ కౌన్సిలర్ కావడం వల్ల గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మహిళలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తుండడం వల్ల అప్పటివరకు నిలబడి నమస్కరించి ఒక్కసారిగా కాళ్లపై పడి ఓటు అభ్యర్థించారు. ఓటర్లు అవాక్కయ్యారు.
నీ కాళ్లు మొక్కుతా..నాకే ఓటేయండి.. - municipal Elections in telangana
పుర ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలిక పరిధిలోని 14వ వార్డులో భాజపా అభ్యర్థి మరి పోచయ్య వినూత్నంగా ఓటర్ల కాళ్లపై పడి నమస్కరిస్తూ కమలానికి ఓటు వేయాలని వేడుకున్నారు.
ఓటు వేయాలంటూ కాళ్లు మొక్కతున్న అభ్యర్థి