రాబోయే ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో భాజపా జెండా ఎగరేలా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్ కార్యకర్తలను కోరారు. జగిత్యాలలో పర్యటించిన అర్వింద్.. జిల్లా భాజపా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దుబ్బాక ఎన్నిక సీఎం కేసీఆర్కు ఊహించని దెబ్బ అని... ఈ ఓటమితో తెరాస ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.
'జగిత్యాలలో భాజపా జెండా ఎగిరేలా కృషి చేయాలి'
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాలలో పర్యటించారు. జిల్లా భాజపా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. దుబ్బాక విజయం స్ఫూర్తితో కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు.
mp arvind visited in jagityal
దేశవ్యాప్తంగా భాజపా హవా కొనసాగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు పని చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అర్వింద్ ఆరోపించారు. కేంద్రం నుంచి నిధుల రూపంలో వేల కోట్లు రాష్ట్రానికి వస్తున్నా.. ఏమీ రావట్లేదని తెరాస అబద్దాలు ఆడుతోందని మండిపడ్డారు. తెరాస తీరును ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు.