దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో వలస జీవుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఉన్నచోట ఉపాధి లేక..సొంత గ్రామానికి వెళ్లలేక కొట్టుమిట్టాడుతున్నారు. ఎలాగోలా సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు నానాతిప్పలు పడుతున్నారు. ఎండమావుల్లా మారిన పరిస్థితుల్లో ఎడారి ఓడలపైనే ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు నుంచి కరీంనగర్‌కు ఇలా ఒంటెలపై ప్రయాణం చేస్తూ కనిపించారు. వారు తమ వివరాలు చెప్పేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.
ఒంటెలపై వలస కార్మికుల ప్రయాణం - VONTELA_PY_VALASA_KARMIKULU
లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఉన్నచోట ఉపాధి లేక.. సొంత గ్రామానికి వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఎండమావుల్లా మారిన పరిస్థితుల్లో ఒంటెలపై జగిత్యాల జిల్లా వెల్గటూరు నుంచి కరీంనగర్‌కు ప్రయాణిస్తూ ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కారు.
ఒంటెలపై వలస కార్మికుల ప్రయాణం
తమ వివరాలు తెలిస్తే తమ ప్రయాణాలు ఎక్కడ నిలిపేస్తారోనన్న ఆందోళన వారి కళ్లలో స్పష్టంగా కనిపించింది. ప్రతి నిత్యం హైదరాబాద్ నుంచి వలస జీవుల ప్రయాణం మధ్యప్రదేశ్, మహారాష్ట్రల వైపు కొనసాగుతుండగా.. వీరు మాత్రం తిరోగమన దిశలో ప్రయాణిస్తూ కనిపించారు. బహుశా సొంత రాష్ట్రానికి తిరిగి వెళుతుంటే సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకొని ఉంటే తిరుగుప్రయాణం కొనసాగిస్తున్నారేమోనన్న అభిప్రాయం వ్యక్తమైంది.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల గోస