సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత
భాజపాతో తెరాస కలుస్తుందని.. కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
తెరాస ప్రభుత్వంతో పాటు తన పని తీరును చూసి మళ్లీ పట్టం కట్టాలని నిజామాబాద్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భాజపాతో తెరాస కలుస్తుందని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 34 కోట్ల మంది మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 4,300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణలో 70 లక్షల మంది కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 4 కోట్ల బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు.