TRS MLA Sanjay Dance Video: ప్రజాసంబంధిత కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నాయకులు కొత్తగా ఏం చేసినా మనకు ఆశ్చర్యం కలిగించేదే. బంధువుల వివాహ వేడుకలు, ఇతర ఫంక్షన్లకు ముఖ్యమైన అతిథులుగా వెళ్లే ప్రజాప్రతినిధులు అలా వెళ్లి ఇలా రావడం మనకు తెలిసిందే. వారి వారి కార్యక్రమాల దృష్ట్యా బిజీ షెడ్యూల్లో అక్కడ ఎక్కువ సేపు ఉండటం కుదరని పని. కానీ ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో బంధువులతో కలిసి చాలా సేపు సరదాగా గడిపారు ఓ ఎమ్మెల్యే. తన స్థానాన్ని పక్కనపెట్టి వారితో ఆడిపాడి ఆనందపరిచారు.
మాటే కాదు ఆటా వచ్చు.. మెహందీ వేడుకలో ఎమ్మెల్యే సంజయ్ స్టెప్పులు - jagtial district news
TRS MLA Sanjay Dance Video: పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లలో ఆటాపాటా సర్వసాధారణం. అవి లేకుండా శుభకార్యాలు చేసిన సందర్భాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. కుర్రకారుతో పాటు పెద్దోళ్లు కూడా తమకు తోచిన రీతిలో కాలు కదుపుతుంటారు. కానీ అలాంటి ఫంక్షన్లలో సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా చిన్న స్టెప్పేసినా ఆహా అనుకుంటాం. ఈ క్రమంలో జగిత్యాలలో జరిగిన ఓ వివాహ వేడుకలో సరదాగా స్టెప్పులేసి అందరినీ ఆనందపరిచారు.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్కు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. స్టెప్పులేసి సందడి చేశారు. మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ లియాఖాత్ అలీ మోహసీన్ కుమార్తె.. మెహందీ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ ఫంక్షన్లో నిర్వహించిన ఢోలక్ గీత్ పై కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు వేశారు. వేడుకలో ఎమ్మెల్యే డ్యాన్స్ వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి:GO 317 dharna: ప్రగతిభవన్ వద్ద హై అలెర్ట్.. ప్రతి వాహనం తనిఖీ