జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. కొండగట్టులో రామకోటి స్తూపానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి భూమిపూజ చేశారు.
కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ - mlc kavitha
జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు.
కొండగట్టులో రామకోటి స్తూపానికి భూమిపూజ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 90 లక్షల రూపాయలతో స్థూపాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. జూన్ 4వ తేదీ లోగా ఈ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. కొండగట్టు ఆంజనేయ సేవా సమితిని ఏర్పాటు చేసి.. ఇంటింట్లో హనుమాన్ పారాయణం జరిగే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని కవిత తెలిపారు.
ఇదీ చదవండి:తెలంగాణలో మరో 142 కరోనా కేసులు...