జగిత్యాలలో రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కొరత ఏర్పడగా.. ఇప్పుడు సమస్య మరింత తీవ్రమైంది. జిల్లా సహకార సంఘం వద్దకు లారీ యూరియా రావటం వల్ల రైతులు భారీగా తరలివచ్చారు. రైతులందరికీ యూరియా దొరకనందున ఆందోళనకు దిగి ఏడీఏ సురేష్‌ను చుట్టుముట్టారు. సకాలంలో యూరియాను అందించకపోతే దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో మూడు వేల టన్నుల యూరియా రానుందని ఆయన హామీ ఇచ్చాక అన్నదాతలు శాంతించారు.
యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులు
జగిత్యాలలోని రైతులు యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా సహకార సంఘం వద్దకు తక్కువ మొత్తంలో యూరియా రావటం వల్ల వారంతా ఆందోళనకు దిగారు.
యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులు