తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రాకకోసం ముస్తాబవుతున్న ధర్మపురి

ముఖ్యమంత్రి కాళేశ్వరం పర్యటనలో భాగంగా ధర్మపురి వచ్చే ప్రణాళిక ఉన్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఏ రోజున వచ్చేది సమాచారం లేనప్పటికీ... అధికారులు ముందస్తుగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జగిత్యాల కలెక్టర్‌ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం రాకకోసం ముస్తాబవుతున్న ధర్మపురి నగరం

By

Published : Aug 5, 2019, 8:57 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి రానున్నారు. ఏ రోజు వస్తారన్న స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ధర్మపురి రానున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాచారం మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ పార్కింగ్‌ కోసం వక్ఫ్​ భూమిని చదును చేస్తున్నారు. జిల్లా పాలనాధికారి శరత్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ఉంచాలని ఆదేశించారు. రహదారి వెంట మొక్కలు నాటాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నదిని పరిశీలించే అవకాశం ఉన్నందున పుష్కర గాట్ల వద్ద తగిన ఏర్పాట్లను చేయాలన్నారు.

సీఎం రాకకోసం ముస్తాబవుతున్న ధర్మపురి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details