తెలంగాణ

telangana

ETV Bharat / state

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడి ట్టి వద్ద నిర్మించి ఉంటే ఖర్చు తగ్గేవని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. 1500 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేదని వెల్లడించారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి

By

Published : Aug 12, 2019, 9:35 PM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు పక్షం రోజుల నుంచే నీటిని తరలించే అవకాశం ఉన్నా ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించే అవకాశం కొల్పోయినట్లు వెల్లడించారు. ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడిహట్టి వద్ద నిర్మిస్తే కేవలం 1500 కోట్లతో నిర్మాణం జరగటమే కాకుండా... మేడిగడ్డ, అన్నారం లిప్టులు అవసరం లేకుండానే ఎత్తిపోసే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే 60శాతం నిధులను కేంద్రమే భరిస్తుందన్నారు. కమీషన్ల కోసమే మేడిగడ్డ వద్ద నిర్మించారని.. సీఎం తీరుతో ప్రజాధనం వృథా అయిందని జీవన్‌రెడ్డి విమర్శించారు.

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details