తెలంగాణ

telangana

ETV Bharat / state

చికెన్​ ప్రియులకు చేదు కబురు

ఆదివారం వచ్చిందంటే భోజన ప్రియులంతా వరుస కట్టేది చికెన్​ దుకాణాల ముందే. ప్రస్తుత పరిస్థితుల్లో కడుపు నిండా చికెన్​ తినాలంటే మాత్రం జేబు కాస్త ఖాళీ చేయాల్సిందే. భానుడి భగభగలు, ఉక్కపోతకు భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకు వస్తున్నారు. రవాణా ఛార్జీల భారం, డిమాండ్​ పెరగడం వల్ల ప్రస్తుతం కిలో చికెన్​ ధర రూ.260  దాటింది.

మాంసాహార ప్రియులకు చేదు కబురు

By

Published : Jun 16, 2019, 11:25 PM IST

గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత.. వెరసి చికెన్​ ధరలకు రెక్కలొచ్చాయి. ముందెన్నడూ లేనంతగా ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. కిలో కోడి ధర రూ.150కి విక్రయిస్తుండగా, స్కిన్​లెస్​ చికెన్​ రూ. 260 దాటిపోయింది. ఒక్కసారిగా ఇంత మొత్తం పెరగడంపై మాంసాహార ప్రియులు, వ్యాపారులు గగ్గోలుపెడుతున్నారు. ఓ వైపు భానుడి ప్రకోపంతో కోళ్లు మరణించగా.. రంజాన్​ మాసం రావడం డిమాండ్​ భారీగా పెరుగేందుకు కారణమైంది.

మాంసాహార ప్రియులకు చేదు కబురు

జగిత్యాల జిల్లాలో సుమారు 50 వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. సిద్దిపేట, మహారాష్ట్ర నుంచి కోళ్లను ఇక్కడికి తీసుకొచ్చారు. దూరం కావడం, రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూడా కోళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే కిలో చికెన్​ ధర రూ. 300 కు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఇవీ చూడండి: 'ఆదివాసీలను జంతువులను చూసినట్లు చూస్తారా...?'

.....................

ABOUT THE AUTHOR

...view details