తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష తులసి దళాలతో లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన

నవరాత్రోత్సవాల సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. లక్ష తులసి దళాలతో అర్చన నిర్వహించారు.

లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన

By

Published : May 11, 2019, 12:33 PM IST

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ప్రత్యేక అభిషేకంతో పాటు విశేష పూజలు జరిపించారు. అనంతరం లక్ష తులసి దళాలతో అర్చన నిర్వహించారు. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 17 వరకు నవరాత్రోత్సవాలు జరగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

లక్ష్మీ నరసింహ స్వామికి అర్చన

ABOUT THE AUTHOR

...view details