వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు - assembly
''రాజశేఖర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు...రాజశేఖర్‌రెడ్డి, నేను ఒకే గదిలో పడుకున్నాం...మా అంత మంచి స్నేహితులు ఎవరూ లేరు..మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విభేదాల్లేవు"- చంద్రబాబు
నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగింది.ఈ క్రమంలో అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.రోడ్డు పక్క ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలపై మాట్లాడి చర్చను తప్పుదోవ పట్టిస్తారా?అంటూ అంబటి రాంబాబు అన్న మాటలకు చంద్రబాబు స్పందించారు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని తెలిపారు.రాజశేఖర్‌రెడ్డి,తాను ఒకే గదిలో పడుకున్నామని గుర్తు చేశారు.మాలాంటి మంచి స్నేహితులు ఎవరూ లేరని వెల్లడించారు. తమ మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విభేదాల్లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.