కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో పోలీసుల తీరు వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన వీరభద్రస్వామి.. బెంగళూరు వలస వెళ్లి లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో యువకులతో కలిసి రహదారి పక్కనే కూర్చోగా.. ఎవ్వరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తూ పోలీసులు అక్కడికి వచ్చారు.
పోలీసులు వస్తున్నారనే భయంతో పరిగెత్తుతూ యువకుని మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం జరిగింది. రహదారి వద్ద కూర్చున్న పెద్దహరివాణం గ్రామస్థులను.. లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు లాఠీలతో తరిమారు. తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు వస్తున్నారని భయంతో పరిగెత్తుతూ యువకుని మృతి
గుంపుగా కూర్చున్న వీరభద్రస్వామి బృందాన్ని వెంబడించడం వల్ల భయపడి పరిగెత్తారు. ఈ క్రమంలో వీరభద్రస్వామి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు. పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :కరోనా మూడో దశకు చేరుకుంటే.. ఏం చేద్దాం: ఈటల