తెలంగాణ

telangana

మినీ మున్సిపల్​ ఎన్నికలు అవసరమా?: శివసేనా రెడ్డి

By

Published : Apr 20, 2021, 3:56 PM IST

తెరాస, భాజపా పార్టీల నేతలు ప్రజలను గాలికొదిలేశారని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్ష రూపాయలు ఇచ్చినా బెడ్లు దొరికే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా కరోనా చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

youth congress leader shivsena reddy
మినీ మున్సిపల్​ ఎన్నికలు అవసరమా?: శివసేనా రెడ్డి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున లక్ష రూపాయలు ఇచ్చినా...బెడ్లు దొరికే పరిస్థితి లేదని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన హాలియా సభలో వేదికపై ఉన్న కేసీఆర్​కే కరోనా సోకిందని విమర్శించారు. ఆ సభకు హాజరైన జనం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మినీ మున్సిపల్ ఎన్నికలు అవసరమా అని నిలదీశారు.

ఓట్ల కోసం భాజపా రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఊర్ల పేర్లు మారుస్తా అని చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. నలుగురు ఎంపీలు ఉండి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు ఎందుకు తెప్పించలేకపోతున్నారని నిలదీశారు. ప్రధాని మోదీ ఉండేది... ప్రచారం కోసమా.... అని ప్రశ్నించారు. తెరాస, భాజపా నేతలు ప్రజలను గాలికొదిలేశారని ఆరోపించిన శివసేనా రెడ్డి... రూపాయి ఖర్చు లేకుండా కరోనా చికిత్స ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details