తెలంగాణ

telangana

Lockdown: పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయనున్న ప్రభుత్వ ఆఫీసులు

By

Published : Jun 9, 2021, 7:17 PM IST

సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్​ సడలింపుతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయి ఉద్యోగులతో పనిచేయనున్నాయి. సచివాలయ ఉద్యోగులు అందరూ విధులకు హాజరు కావాలని సర్కారు స్పష్టం చేసింది. ఈమేరకు సీఎస్ సోమేశ్ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు.

with lockdown relaxations from tomorrow onwards government offices will work with full staff
పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేయనున్న ప్రభుత్వ ఆఫీసులు

రేపటి నుంచి సచివాలయ అధికారులు, ఉద్యోగులు అంతా పూర్తి స్థాయిలో విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్​డౌన్ సడలింపులను సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగించిన సర్కారు... పూర్తి స్థాయి ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని తెలిపింది. అందుకు అనుగుణంగా సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ సాధారణ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

లాక్​డౌన్​ విధింపు నుంచి ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం మంది ఉద్యోగులు, సిబ్బందితోనే పనిచేశాయి. విడతలవారీగా సడలింపు సమయాలు పెంచగా… ఆమేరకు ఆఫీసులూ పనిచేసేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షల​ సడలింపులు ఇవ్వగా… ఆ వేళల్లో 100 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details