ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Wip_Venkateswarlu
By
Published : Aug 31, 2019, 3:56 PM IST
మాట్లాడుతున్న బొడకుంటి వెంకటేశ్వర్లు
కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను అరెస్ట్ చేయాలనిడిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎక్కువైందని... పీసీసీ పదవిని దక్కించుకోవడానికే ఆయన ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభాకర్ రావు తెరాస ప్రభుత్వంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా విద్యుత్ శాఖలో పని చేశారని గుర్తుచేశారు.