తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య

భాగ్యనగరంలో రోజుకోదారుణం వెలుగుచూస్తోంది. తెల్లారితే ఏఘోరం వినాల్సి వస్తుందోనని నగరవాసులు కలవరపడుతున్నారు. పట్టణానికి వలసొచ్చిన వారిలో కుటుంబాలకు దూరంగా ఉండటం, పర్యవేక్షణ లేకపోవడంతో నేరాలబాట పడుతున్నారు. తమ అక్రమసంబంధానికి అడ్డొస్తాడని ప్రియుడితో కలసి భార్య... భర్తను అంతమొందించింది. దాన్ని సాధారణ మరణంగా చిత్రీకరించబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య

By

Published : Feb 7, 2019, 11:27 PM IST

భర్తను చంపిన భార్య
సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలసి భర్తను హతమార్చి ఆపై అంత్యక్రియలు నిర్వహించిన భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్​ బోయిన్​పల్లికి చెందిన బాబాఖాన్,​ జాహిదాబేగం ఆలుమగలు. జాహిదాకు అదే ప్రాంతానికి చెందిన ఫయాజ్​తో అక్రమసంబంధం ఉంది. తమ విషయం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని ప్రియుడితో కలసి బాబాఖాన్ ను అంతమొందించేందుకు పన్నాగం పన్నింది.
నవంబరులో ఓరోజు భర్తకు ​టీలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు గాఢనిద్రలోకి జారుకున్నాక ఫయాజ్​ఖాన్ అతని స్నేహితులతో కలిసి గొంతు నొక్కి హత్యచేసింది. చనిపోయాడని నిర్ధరించుకున్నాక ఎక్కడివాళ్లక్కడికి వెళ్లిపోయారు. తెల్లారాక తన భర్త గుండెపోటుతో మృతిచెందారని అందరిని నమ్మించింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
అన్న మృతిపై అనుమానమొచ్చిన బాబా ఖాన్ సోదరుడు బోయిన్ పల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపి దర్యాప్తు చేశారు. జాహిదా, ఫయాజ్ ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు సహకరించిన అతని స్నేహితులను అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details