తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం​పై వారం రోజుల్లో జ్యుడీషియల్ విచారణ : మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Reddy on Kaleshwaram Project Issue : వారం రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్​పై జ్యూడీషియల్​ విచారణ వేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం రీడిజైన్లను, అదనపు అంచనాలను కేంద్రం ఎందుకు అంగీకరించిందని ఉత్తమ్ ప్రశ్నించారు. పదేళ్లుగా బీజేపీ, బీఆర్​ఎస్ కలిసే ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకే దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు కాలేదన్నారు.

Judicial Inquiry on Medigadda Barrage
Uttam Kumar Reddy on Kaleshwaram Project Issue

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 7:04 PM IST

Updated : Jan 2, 2024, 7:57 PM IST

Uttam Kumar Reddy on Kaleshwaram Project Issue: బీఆర్ఎస్​, బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై భారీగా అప్పుల భారం పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి తెలిపారు. పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్​, బీజేపీలు కలిసే పని చేశాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​(Kaleshwaram Project) విషయంలో కేంద్ర నిబంధనలు మార్చి మరీ ఆ ప్రాజెక్ట్​కు రుణాలు ఇప్పించిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్​ అవినీతికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే, ప్రాజెక్ట్​పై సమస్యలు బయటపడుతున్నా కేంద్రం ఎందుకు స్పందించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

Minister Uttam Kumar Quationned to Central Government :కాళేశ్వరం ప్రాజెక్ట్​కు కేంద్ర ఆధీనంలోని పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​(Power Finance Corporation) రుణం ఇచ్చిందని ఉత్తమ్​ కుమార్​ గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఆ సంస్థ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విద్యుత్​ రంగ ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇవ్వాల్సిన సంస్థ కాళేశ్వరానికి ఎందుకు రుణం ఇచ్చిందని నిలదీశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం​ రూ.లక్ష కోట్లు రుణాలు తీసుకున్నా మరీ కేంద్రం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

"కాళేశ్వరంలో అవినీతి గురించి పార్లమెంటులో ఎన్నోసార్లు ప్రస్తావించాను. కాళేశ్వరంపై వారం రోజుల్లో జ్యుడీషియల్ విచారణ వేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. బీఆర్ఎస్​ కోసమే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిబంధనలు మార్చి రుణాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగు కోసమే పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పడింది. కిషన్‌రెడ్డి మూడు నెలలుగా మేడిగడ్డను ఎందుకు పరిశీలించలేదు."- ఉత్తమ్​కుమార్​ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి

Judicial Inquiry on Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉత్తమ్​ కుమార్(Uttam Kumar Reddy)​ అన్నారు. మూడు నెలలుగా మూడు నెలలుగా ప్రాజెక్ట్​ను ఎందుకు పరిశీలించలేదని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​పై సీబీఐ విచారణకు జరిపించాలని కిషన్​రెడ్డి ఎందుకు అడగలేదని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పారదర్శకత, అవినీతిరహిత పాలనకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. రీడిజైన్లను, అదనపు అంచనాలను కేంద్రం ఎందుకు అంగీకరించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Minister Uttam Kumar Fire on BJP : కర్ణాటక, దిల్లీ, పంజాబ్​లో సీబీఐ విచారణకు ప్రభుత్వాలకు అనుమతి తీసుకున్నారా అని బీజేపీని ప్రశ్నించారు. విపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలపైకి సీబీఐ, ఈడీని పంపే కేంద్రం మాజీ సీఎం కేసీఆర్‌పై విచారణ ఎందుకు జరపలేదో చెప్పాలన్నారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు కాలేదని చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్​, బీజేపీ విధానాల వల్లే తెలంగాణపై భారీగా అప్పుల భారం పడిందని దుయ్యబట్టారు.

కాళేశ్వరం​పై వారం రోజుల్లో జ్యుడీషియల్ విచారణ వేస్తాం మంత్రి ఉత్తమ్‌

రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తాం - నీటి వాటా విషయంపై కేంద్రంతో చర్చిస్తాం : ఉత్తమ్​

Last Updated : Jan 2, 2024, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details