తెలంగాణ

telangana

ETV Bharat / state

Uppal Sky Walk: మే మొదటి వారంలో అందుబాటులోకి ఉప్పల్​ స్కైవాక్..!

Uppal Sky Walk: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్కైవాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మే నెల మొదటి వారంలో ఈ స్కైవాక్​ను ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ సిద్దమవుతోంది. జంట నగరాల్లో కాలినడకన వెళ్లే వారి కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనస్తోంది. నగరంలోని అతి పెద్ద చౌరస్తాలో ఒకటైన ఉప్పల్ సర్కిల్​లో స్కైవాక్​ను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఉప్పల్ జంక్షన్ వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. కాలినడకన వెళ్లే వారు ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా.. స్కైవాక్ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్రో స్టేషన్​కు కూడా అన్ని కూడళ్ల నుంచి ఈ స్కైవాక్ నుంచి నేరుగా చేరుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు.

uppal skywalk
త్వరలో ప్రారంభం కానున్న ఉప్పల్ స్కైవాక్

By

Published : Apr 27, 2023, 2:16 PM IST

Uppal Sky Walk: నగరంలోని ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటేవారి కోసం ప్రత్యేకమైన స్కైవాక్​ను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దగా ఉండటంతో కాలినడకన రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిక్ చెక్ పెట్టేందుకు చౌరస్తాలో స్కైవాక్ నిర్మిస్తున్నారు. 660 మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్ మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు.

నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్​కు:ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్​తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్​కు చేరుకునేలా దారులు ఏర్పాటు చేశారు. ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా స్కైవాక్ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు, గర్భిణులు స్కైవాక్ చేరుకోవడానికి ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నడక వంతెనతో జంక్షన్​లో ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పనున్నాయి.

మరికొన్ని చౌరస్తాల్లో:స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 3-4 మీటర్లు, 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేశారు. రామంతాపూర్ రోడ్డు, నాగోలు రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్, ఉప్పల్ సబ్ స్టేషన్ ఉప్పల్ జంక్షన్ అనుసంధానంగా నిర్మిస్తున్న స్కైవాక్​ మే నెలలో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే.. దీని ఫలితాన్ని చూసి నగరంలోని మరికొన్ని చౌరస్తాల్లో వీటిని నిర్మించేలా అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన సుందరీకరణ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికి పైగా పాదచారులు అటూ ఇటూ రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా.

సిగ్నల్ ఫ్రీగా:ఉప్పల్ స్కైవాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు దీనిని వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది. ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సాధారణంగా సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. ఇకపైన ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణీకులు మెట్రో కాన్ కోర్ నుంచి పాదచారుల వంతెన మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాల వైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details