హిమాచల్‌ప్రదేశ్‌లో కొవిడ్-19 పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ చర్చించారు. ఇరువురు ఫోన్ ద్వారా ఆ రాష్ట్రంలో కరోనా ప్రభావం, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్లు గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
బండారు దత్తాత్రేయతో సంభాషించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చించారు. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కట్టడి చర్యలపై ఇరువురు ఫోన్లో చర్చించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మాజీ ఆర్మీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్ గవర్నర్‌కు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాపై అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దత్తాత్రేయ రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలిపారు. అవసరమైతే మాజీ సైనికుల సేవలు, మిలటరీ సేవలను వినియోగించుకుంటామని వివరించారు. కరోనా కష్టకాలంలో అందరం కలిసికట్టుగా పోరాటం చేసి వైరస్‌పై విజయం సాధించాలని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పినట్లు గవర్నర్ దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి సబిత