కరోనాని కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వైరస్ను నివారించేందుకు మంత్రులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేకకార్యదళం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో నిర్వహించిన గ్లకోమా డేలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గ్లకోమా సమస్య ఉందన్న ఆయన ముందుగా గుర్తిస్తే చూపు కాపాడుకోవచ్చని చెప్పారు.
కరోనా కట్టడికి కేంద్రం కృషి చేస్తోంది: కిషన్ రెడ్డి
కరోనా కట్టడికై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషిచేస్తోందని హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు తమ సర్కార్ తక్షణ చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
kishanreddy
కరోనా ప్రభావిత దేశాల నుంచి భారతీయులను రప్పించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన ప్రభుత్వం