తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు హైదరాబాద్​కు రానున్న కేంద్రమంత్రి అమిత్​ షా - కేంద్రమంత్రి అమిత్​ షా

Amit Shah Will Attend 54th Foundation Day Of CISF In Hyderabad: నేడు హైదరాబాద్​ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. సీఐఎస్​ఎఫ్​ రైజింగ్​ డే పరేడ్​లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. నేడు రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కానీ దీనిపై స్పష్టత మాత్రం రాలేదు.

amith shah
amith shah

By

Published : Mar 11, 2023, 9:18 AM IST

Amit Shah Will Attend 54th Foundation Day Of CISF In Hyderabad: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. నేడు హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 8 గంటల 25 నిమిషాలకి ప్రత్యేక విమానంలో.. హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఎన్​ఐఎస్​ఏలో రాత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం సీఐఎస్​ఎఫ్​ రైజింగ్ డే పరేడ్​లో.. అమిత్ షా పాల్గొననున్నారు. అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా ప్రత్యేక విమానంలో.. కేరళ రాష్ట్రం కొచ్చికి వెళ్లనున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. నేడు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ ఖాయం అయితే.. రాత్రికి నేతలు సమావేశం కానున్నారు.

ఖరారు కాని అమిత్‌ షా పార్టీ కార్యక్రమాలు.. హైదరాబాద్​ రానున్న కేంద్రమంత్రి అమిత్​ షా కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. శనివారం రాత్రి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఉన్న సమావేశంపై కూడా స్పష్టమైన సమాచారం లేదు. అయితే హైదరాబాద్​లోని సీఐఎస్​ఎఫ్​ వ్యవస్థాపక వేడుకలకు హాజరవుతారని మాత్రం సరైన సమాచారం అందింది.

సీఐఎస్​ఎఫ్​ 54వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్​ షా:సీఐఎస్​ఎఫ్​ 54వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు హాజరుకానున్నారని సీఐఎస్​ఎఫ్​ ఉన్నతాధికారులు తెలిపారు. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట మండలం హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో ఈ నెల 12న ఉదయం నిర్వహించే కార్యక్రమంలో సీఐఎస్​ఎఫ్​ బలగాలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయని చెప్పారు.

Union Home Minister Amit Shah Is Coming To Hyderabad: జాతీయ భద్రతలో సీఐఎస్​ఎఫ్​ చేస్తున్న సేవలను వారు ప్రత్యేకంగా వివరించారు. సీఐఎస్​ఎఫ్​ 1969లో 2,800 మందితో ప్రారంభమై..దేశ రక్షణలో తన వంతు పాత్రను నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం 1.70 లక్షల మందితో సాయుధ దళంగా మారి.. 53 ఏళ్లుగా సేవలందిస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 66 విమానాశ్రయాలు, ఓడరేవులు, అంతరిక్ష కేంద్రాలు, అణు, దిల్లీ మెట్రో, పవర్​, స్టీల్​ ప్లాంట్లుతో సహా 354 అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల్లో భద్రతను నిర్వహిస్తోంది.

2022లో ఏప్రిల్​- డిసెంబరు మధ్య 4,041 కేసులు నమోదు చేసి.. అందులో 746 మందిని నిందితులుగా అరెస్టు చేశారు. రూ.14.84 కోట్లును రికవరీ చేశారని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో 465 కేసులు నమోదు చేయగా.. అందులో 101 మందిని అరెస్ట్​ చేసి.. వారి వద్ద నుంచి రూ. 1.36 కోట్లును రికవరీ చేశామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details