తెలంగాణ

telangana

WEATHER_REPORT:ఉపరితల ద్రోణి ప్రభావం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

By

Published : Nov 3, 2021, 3:28 PM IST

రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు (rains in telangana)కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Two days Heavy rains
రెండు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు(rains in telangana) కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (rains in telangana)కురుస్తాయని వెల్లడించింది.

మరోవైపు నిన్న ఏర్పడిన అల్పపీడనం అరేబియా సముద్రం వైపు వెళ్లిపోయిందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొమరిన్‌ ప్రదేశము నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, తమిళనాడు తీరం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వరకు వ్యాపించిందని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి అక్కడే స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ సంచాలకులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈశాన్య దిశ నుంచి కింది స్థాయికి గాలులు వీస్తున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి:

Weather Report: రెయిన్ అలర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details