రాష్ట్రంలో టీఆర్టీ, గ్రూప్-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. తొలుత గ్రూప్-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్టీపై మరోసారి రీలింక్వీష్మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశిలిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు16 వరకు టీఆర్టీ అభ్యర్థుల నుంచి రీలింక్వీష్మెంట్ను తీసుకుంది. ఆపై ఆదనంగా అర్హత పొందిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించింది. వీలైనంత తర్వగా టీఆర్టీ నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పండుగ సెలవుల్లోనూ టీఎస్పీఎస్సీ అధికారులు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
రెండ్రోజుల్లో టీఆర్టీ ఫలితాలు
ఎట్టకేలకు టీఆర్టీ, గ్రూప్-2 ఫలితాలను ఈ నెలఖరుకల్లా విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రెండ్రోజుల్లో టీఆర్టీ ఫలితాలు