తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస ఎమ్మెల్యేలకు ఎర.. కీలక వీడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్

trs mlas buying videos released by cm kcr తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన పలు కీలక వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఎవరైనా చూడాలనుకుంటే.. ఈ 3 గంటల ఫుటేజ్‌ హైకోర్టులో ఉంది.. ఎవరైనా అడిగి తీసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు.

trs mlas buying videos released by cm kcr
trs mlas buying videos released by cm kcr

By

Published : Nov 3, 2022, 8:51 PM IST

Updated : Nov 3, 2022, 10:19 PM IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర.. కీలక వీడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్

trs mlas buying videos released తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కేసీఆర్ స్పందించారు. గత నెలలో రామచంద్ర భారతి ఇక్కడికి వచ్చారని ఆరోపించారు. విశ్వప్రయత్నం చేసి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. రామచంద్ర భారతి చేస్తున్న ప్రయత్నాన్ని ఎమ్మెల్యే తనకు చెప్పినట్లు వెల్లడించారు. మూడు గంటలు వీడియో ఫుటేజ్‌ ఉందని తెలిపారు.

''ప్రజలు, కోర్టుల సౌకర్యం కోసం ముఖ్యమైన ఫుటేజ్‌ను చూపిస్తున్నా.. తెలంగాణ, దిల్లీ, ఏపీ ప్రభుత్వాలను కూల్చేస్తామని చెప్పారు. రాజస్థాన్‌తో పాటు మిగతా ప్రభుత్వాలను కూల్చేస్తామని అన్నారు. ఇప్పటికే 8 ప్రభుత్వాలను కూల్చేశారు. ఈ ముఠాల కుట్రను బద్ధలు కొట్టాలని అనుకున్నాం. తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ కాబట్టే ఈ ముఠా కుట్రలను బద్ధలు కొట్టింది. తెలంగాణ హైకోర్టుకు కూడా వీడియోలు పంపించాం. ఈ ముఠా చిన్నది కాదు... 24 మంది ఉన్నామని వాళ్లే చెప్పారు.'' -కేసీఆర్, ముఖ్యమంత్రి

Cm kcr on trs mlas buying తమ స్కానర్‌లో ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని హామీ ఇచ్చారని వెల్లడించారు. వచ్చిన ముఠాలోని ఒక్కో వ్యక్తికి 3 ఆధార్‌, పాన్‌కార్డులు ఉన్నాయన్నారు. వచ్చిన ముఠాలోని ఒక్కో వ్యక్తికి రెండేసి డ్రైవింగ్‌ లైసెన్సులు ఉన్నాయని తెలిపారు. మేం సేకరించిన ప్రతి ఆధారాన్ని కోర్టుకు పంపుతున్నామన్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తామంటే ఎవరూ క్షమించరన్నారు.

''నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులు ఎవరిచ్చారు? వేల కోట్ల రూపాయలు ఎవరి వద్ద నుంచి వచ్చాయి? ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై దిల్లీ సీఎంను అప్రమత్తం చేశా... ఈవీఎంలు ఉన్నంతవరకు భాజపాకు ఢోకా లేదని వాళ్లు మాట్లాడారు. ఈ వ్యవహారాన్ని ఒక కేసులా చూడవద్దని జడ్జిలను కోరుతున్నా... అన్ని రాష్ట్రాల డీజీపీలకూ ఈ వీడియోలు పంపుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, యువతదే. విపక్ష పార్టీలను కూల్చే లక్ష్యంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీలో జయప్రకాశ్ నారాయణ్‌ లాంటి ఉద్యమం రాబోతుంది.'' - కేసీఆర్, ముఖ్యమంత్రి

రాజ్యాంగేతర శక్తుల వీరవిహారాన్ని అరికట్టకపోతే అందరికీ ప్రమాదముందని కేసీఆర్ హెచ్చరించారు. ఒక్కో సభ్యుడికి వంద కోట్లు ఇస్తామని.. సెక్యూరిటీ ఇస్తామని చెప్పారన్నారు. వందలు, వేల కోట్లు ఇస్తామన్నారు.. ఇవన్నీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడి పద్ధతులతో ఈ ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు.

''ఓ కేంద్రమంత్రి మీ పార్టీలో ఇతర పార్టీ సభ్యులను కలుపుకోలేదా అన్నారు. మా పార్టీలో కలుస్తామని కాంగ్రెస్‌ సభ్యులు వచ్చారు. రాజ్యాంగబద్ధమైన పద్ధతిలోనే కాంగ్రెస్‌ సభ్యులను కలుపుకొన్నాం. హైదరాబాద్‌కు వచ్చి మా ప్రభుత్వాన్నే కూల్చేస్తామని అన్నారు. దేశ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఈ వీడియో చూపిస్తున్నా.. ఈ వీడియోలో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌ ఉన్నారు. ఆపరేషన్‌ చేసేవారిలో సంతోష్‌, అమిత్‌షా, నడ్డా ఉన్నట్లు చెప్పారు. బంగాల్‌లో 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రధానే అన్నారు. ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రధానే ఇలా ఉంటే మిగతావారు ఎలా ఉంటారో ఆలోచించాలి'' అని కేసీఆర్ వివరించారు.

కీలక వీడియోలు రిలీజ్ చేసిన కేసీఆర్

ఈ 3 గంటల ఫుటేజ్‌ హైకోర్టులో ఉంది.. ఎవరైనా అడిగి తీసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపారు. తుషార్‌ కూడా లైవ్‌లో మాట్లాడారన్నారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలిస్తే పార్టీలకతీతంగా కొట్లాడామని చెప్పారు. మోదీతో సఖ్యత లేకపోతే ఈడీ వస్తుందని చెప్పారని వివరించారు. కర్ణాటక ఎమ్మెల్యేలను కూడా కొన్నట్లు చెప్పారని వెల్లడించారు.

''ఆ వీడియోలో కర్ణాటక ఎమ్మెల్యేల కొనుగోలు క్రమాన్ని వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చింది మేమే అన్నారు. అమిత్‌షా పేరు పలుసార్లు చెప్పారు, మోదీ పేరు రెండుసార్లు చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడినుంచి తెచ్చారో బయటకు రావాలి. దేశం ప్రమాదంలో పడినప్పుడు కాపాడింది న్యాయవ్యవస్థే. అలహాబాద్‌ హైకోర్టు ఇందిరాగాంధీపై తీర్పు ఇచ్చింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పు తర్వాతే ఉద్యమం ప్రారంభమైంది.'' -కేసీఆర్, ముఖ్యమంత్రి

ఇవీ చూడండి:

భాజపా చెప్పినట్లు చేస్తేనే ఎన్నికల సంఘం సక్రమంగా చేసినట్లా?: కేసీఆర్

Last Updated : Nov 3, 2022, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details