తెలంగాణ

telangana

ETV Bharat / state

మగువల మనసు దోచేస్తున్న ట్రెండ్జ్

హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ఓ హోటల్‌లో ట్రెండ్జ్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మగువలను ఆకట్టుకుంటోంది. ఈనెల 20 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

బంజారాహిల్స్

By

Published : Jul 19, 2019, 12:25 AM IST

ఆధునిక, సంప్రదాయ మేళవింపుతో కూడిన వస్త్రాభరణాల ప్రదర్శన నగరంలో ఏర్పాటైంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని ఓ హోటల్‌లో ట్రెండ్జ్‌ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన పలువురు మహిళలు, యువతుల రాకతో సందడిగా మారింది. దేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళ వ్యాపారవేత్తులు, డిజైనర్లు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ఏర్పాటు చేశారు. ఇందులో లేహంగాస్‌, డిజైనర్‌ చీరలు, జ్యూయలరీ, యాక్సెసిరీస్‌తో పాటు మగువలకు కావాల్సిన అన్నీ రకాలైన వస్త్రాభరణాలు ఒకే వేదికపై ఏర్పాటు చేశారు. ఈనెల 20 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో దాదాపు 70 స్టాల్స్‌లో 50 వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు.

మనసు దోచేస్తున్న ట్రెండ్జ్

ABOUT THE AUTHOR

...view details