రేపు, ఎల్లుండి కలెక్టర్ల సమావేశాల నేపథ్యంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారికి అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. ప్రస్తుతం ఆబ్కారీ, వాణిజ్య పన్నుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నసోమేశ్ కుమార్‌కు రెవెన్యూ శాఖను అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కూడా ఆయనకే ఉంటాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా, రెరా ఛైర్మన్‌గా సోమేశ్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ నీతూకుమారి ప్రసాద్‌కు స్థానచలనమయింది. ఆమె స్థానంలో నిరీక్షణలో ఉన్న రఘునందన్ రావు నియమితులయ్యారు. నీతూకుమారి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు.
ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. రఘనందన్ రావుకు పోస్టింగ్
ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌కుమార్‌ను రెవెన్యూ శాఖ, రాజేశ్వర్ తివారిని అటవీ శాఖకు బదిలీ చేశారు. నిరీక్షణలో ఉన్న రఘనందన్ రావును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా నియమించింది. ఇదే స్థానంలో ఉన్న నీతూకుమారి ప్రసాద్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు.
ముగ్గురి ఐఏఎస్‌ల బదిలీ