తెలంగాణ

telangana

ETV Bharat / state

పశువుల అక్రమ రవాణా... అడ్డుకున్న భాజపా కార్యకర్తలు

ఆవులను, ఎడ్లను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను బీజేవైఎం, భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పటాన్​చెరు టోల్​గేటు వద్ద పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

పశువుల అక్రమ రవాణా

By

Published : Aug 10, 2019, 6:29 AM IST

Updated : Aug 10, 2019, 7:01 AM IST

సరైన ధ్రువపత్రాలు లేకుండా ఆవులు, ఎడ్లను తరలిస్తున్న రెండు వాహనాలను సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు టోల్​గేట్​ వద్ద బీజేవైఎం, భాజపా నాయకులు అడ్డుకున్నారు. పశువులను తరలిస్తున్న వారికి, భాజపా నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. తరలింపుదారులు వాహనానికి అడ్డంగా పడుకుని ఆందోళన చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొడవను చక్కదిద్దారు. పశువైద్యాధికారి సూచనపై ధ్రువీకరణ పత్రాలు ఉన్న వాటిని విడిచిపెట్టి మిగతావాటిని గోశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

పశువుల అక్రమ రవాణా
Last Updated : Aug 10, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details