తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగేవరకు పోరాటం: ఉత్తమ్​కుమార్ రెడ్డి - నాగం అధ్యక్షతన కాంగ్రెస్ నాయకుల సమావేశం

పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి. గాంధీభవన్​లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

Tpcc chief uttam kumar reddy on pothireddypadu
పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగేవరకు పోరాటం: ఉత్తమ్​కుమార్ రెడ్డి

By

Published : Jun 15, 2020, 4:54 PM IST

పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్​లోని గాంధీభవన్​లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తమ్​తో పాటు కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎంపీ మల్లు రవి, పలువురు డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు.

తెలంగాణ పోరాటంలో సాగునీరు ప్రధాన అంశమని ఉత్తమ్​ గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ 6 నెలల కిందనే పోతిరెడ్డి పాడు విస్తరణ గురించి మాట్లాడినా అడ్డుకోలేదన్నారు. నేడు జీఓలు ఇచ్చి పనులు ప్రారంభిస్తున్నా... కేసీఆర్ ఎలాంటి అడ్డుచెప్పడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details