తెలంగాణ

telangana

ETV Bharat / state

revanth reddy: ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై రేవంత్​రెడ్డి సీరియస్.. ఖబడ్దార్ అంటూ... - ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులపై రేవంత్​ రెడ్డి విమర్శలు

ఏపీ మంత్రి పేర్ని నాని సమైక్యాంధ్ర ప్రతిపాదన కేసీఆర్, జగన్‌ కుట్ర అని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి రావోద్దని హెచ్చరించారు.

revanth reddy
revanth reddy

By

Published : Oct 28, 2021, 10:04 PM IST

Updated : Oct 28, 2021, 10:12 PM IST

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం... ఏపీ మంత్రి పేర్ని నానీ "సమైక్య రాష్ట్ర" ప్రతిపాదన తేవడం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​ కుట్ర అని ధ్వజమెత్తారు. వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి రావొద్దని రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. ప్లీనరీ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలను... కేసీఆర్​ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని మాటలను కలిపి ట్వీట్​ చేస్తూ... రేవంత్​ రెడ్డి విమర్శలు చేశారు.

కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన తేవడం… కేసీఆర్, జగన్ “ఉమ్మడి” కుట్ర. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి రావొద్దు. - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఇదీ చూడండి:Minister Perni nani: ఒకే రాష్ట్రంగా కలిసుందాం.. ఏపీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Last Updated : Oct 28, 2021, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details